The Indian team management's decision to drop the experience and in-form Mithali Raj for the Women's World T20 semifinal against England did not surprise former skipper Sourav Ganguly. I have also sat in the dugout after captaining India. When I saw Mithali Raj being dropped, I said 'Welcome to the group. Captains are asked to sit, so just do it. I have done it in Faisalabad. I didn't play an ODI game for 15 months when I was probably the best performer in one-day cricket. says Ganguly.
#SouravGanguly
#MithaliRaj
#indiancricketteam
#Women'sWorldT20
ఐసీసీ వరల్డ్ టీ20లో మంచి ఫామ్‌లో ఉన్నా జట్టు నుంచి హైదరాబాద్ స్టార్ మిథాలీరాజ్‌ను తప్పించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో బ్యాటింగ్‌లో రాణిస్తోన్న సమయంలో తనకు కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని గంగూలీ తాజాగా గుర్తు చేసుకున్నాడు. వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఆడకుండా మిథాలీని తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ గతంలో తనకూ ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అన్నాడు.